రామోజీరావు జర్నలిజంపై జగన్ సాక్షి డైలీ అటాక్

Sakshi Daily
హైదరాబాద్: మీడియా వార్ తారాస్థాయికి చేరుతోంది. తాజాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక ఈనాడు దినపత్రిక అధినేత రామోజీ రావు జర్నలిజాన్నే ప్రశ్నించింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో పాటు తనపై కూడా సిబిఐ, ఈడి, డిఐజి, హోంశాఖల దర్యాప్తు ప్రారంభమైన అంశాన్ని కప్పి పెట్టేందుకు రామోజీ రావు తన ఈనాడు దినపత్రికలో జగన్ సంస్థల్లో ప్రీమియం ఎక్కువగా నిర్ణయించారంటూ ఓ పాత కథనాన్ని పతాక శీర్షిక చేసుకున్నారని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది. అమ్మ రామోజీ అనే శీర్షిక కింద సాక్షి దినపత్రిక రామోజీరావుపై విరుచుకుపడింది. తనపై ప్రారంభమైన విచారణ వార్తను చంద్రబాబుపై సిబిఐ ప్రాథమిక విచారణ అంటూ ఎవరికీ కనబడీ కనపడకుండా ఒక సింగిల్ కాలమ్ వార్తతో సరిపెట్టారని సాక్షి దినపత్రిక వ్యాఖ్యానించింది.

తనపై విచారణ వార్తకు ప్రాధాన్యం తగ్గించడానికి సాక్షి దరువు - డెలాయిట్ చిందు అంటూ ఈనాడులో గత 10, 11 తేదీల్లో రాసిన పాత కథనాలనే శీర్షికగా రామోజీ రావు కలిపికొట్టారని సాక్షి దినపత్రిక విమర్శించింది. రూ. 100 షేరును రూ. 5.28,830 చొప్పున కంపానీకి రామోజీ కట్టబెట్టాడని ఆరోపించింది రూ. 1,800 కోట్ల నష్టాలున్నా ఈనాడు విలువను రూ. 7,000 కోట్లుగా నిర్ధారించారని, దొంగే దొంగ అన్నట్లుగా రామోజీ రావు సాక్షిపై వార్తాకథనాలు రాశారని సాక్షి వార్తాకథనం వ్యాఖ్యానించింది. జగన్‌పై ఈనాడు దినపత్రిక చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చింది. రామోజీ రావు బాధ సాక్షిలో పెట్టుబడులు పెట్టివారి గురించా, లేక సాక్షి నిటారుగా నిలబడి తన దాష్టీకాలను బట్టబయలు చేస్తున్నందుకా అని ప్రశ్నించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+