రామోజీపై మళ్లీ ఉండవల్లి అరుణ్ కుమార్ సమరం

మార్గదర్శి చిట్‌ఫండ్స్ లిమిటెడ్ వ్యాపారాన్ని రామోజీరావు నిర్వహిస్తున్నారని చెప్పడంలో వాస్తవం లేదని బాలాజీ చెప్పగా, మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యాపారాలను తానే నిర్వహిస్తున్నానని రామోజీ రావు చెప్పారని, తద్వారా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన అన్నారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కేసుల్లో తననూ ప్రతివాదిగా చేర్చుకోవాలని కోరుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్ తరఫున పి.బాలాజీ దాఖలు చేసిన, అదే సంస్థపై వివాదం సందర్భంగా 2006లో రామోజీరావు సమర్పించిన అఫిడవిట్లలో పరస్పర విరుద్ధ సమాచారం ఉన్నదని ఉండవల్లి ఆరోపించారు. దీన్నిబట్టి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలుతున్నదని, ఆయనను ప్రాసిక్యూట్ చేయాలని పిటిషన్‌లో అభ్యర్థించారు.












Click it and Unblock the Notifications