లీకులపై ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు హైకోర్టు తాఖీదులు?

Eenadu-Andhrajyothy
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో సిబిఐ దర్యాఫ్తును ప్రభావితం చేసే విధంగా సాక్ష్యులను భయాందోళనలకు గురి చేసేలా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారన్న పిటిషన్‌కు హైకోర్టు స్పందించి ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వార్తను జగన్‌కు చెందిన సాక్షి పత్రిక ప్రచురించింది. వివరాల ప్రకారం... సిబిఐ తన దర్యాఫ్తు వివరాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు లీక్ చేస్తోందని, సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ న్యాయమూర్తితో దర్యాఫ్తు చేయించాలని కోరుతూ ఎమ్మార్ హిల్స్ ఫ్లాట్ కొనుగోలుదారు కె రఘురామకృష్ణరాజు గత వారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీన్ని మంగళవారం న్యాయమూర్తులు విచారించారు. లీకులపై సిబిఐని వివరణ కోరగా తాము సమాచారం ఎవరికీ లీక్ చేయడం లేదని తెలిపింది. దీనిపై సంతృప్తి చెందని న్యాయమూర్తి పిటిషనర్ ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని సిబిఐకి స్పష్టం చేశారు.

ఎమ్మార్ వద్ద ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పట్ల ప్రజల్లో ద్వేషభావం కలిగేలా, సిబిఐ దర్యాఫ్తునకు సంబంధించి అతి సున్నితమైన అంశాలను ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు చేరవేస్తున్నారని విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఆ పత్రికలు ప్రచురించిన వార్తలను సిబిఐ ఇప్పటి వరకు ఖండించలేదని పేర్కొన్నారని తద్వారా లీకులపై అనుమానం కలుగుతోందన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలకు, కేంద్రం హోంశాఖ కార్యదర్శి, సిిబఐ డైరెక్టర్, సిబిఐ జాయింట్ డైరెక్టర్, ఎమ్మార్ హిల్స్ టౌన్ షిప్స్ ప్రయివేట్ లిమిటెడ్ తదితరులకు నోటీసులు జారీ చేసినట్లుగా పేర్కొన్నారు. పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కోర్టు ముందు ఉంచాలని సిబిఐ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+