యడ్యూరప్ప ప్లాన్, దూకుడుకు 'శరద్' వైపు చూపు

తాను జైలులో ఉన్నప్పుడు బిజెపి సీనియర్ నాయకులు పట్టించుకోకపోవడం పట్ల, పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ చేసిన వ్యాఖ్యల పట్ల యడ్యూరప్ప మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీతో జరిగిన చర్చల పట్ల కూడా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదైనా విచారణలు పూర్తయిన తర్వాతనే అని గడ్కరీ యడ్యూరప్పతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో తిరిగి నాయకత్వ పగ్గాలు చేపట్టడం బిజెపిలో సాధ్యం కాదని యడ్యూరప్ప ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో జెడియులో గానీ ఎన్సీపిలో గానీ చేరే ఆలోచనలో యడ్యూరప్ప ఉన్నట్లు తెలుస్తోంది.
చాలా మంది రాష్ట్ర మంత్రులు పాత జెడియుకు చెందినవారు. మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే మృతి తర్వాత బిజెపిలోకి వచ్చి మంత్రి పదవులు చేపట్టినవారు. దాంతో జెడియులో చేరితే తిరిగి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందని, కాంగ్రెసు జెడిఎస్‌లను దెబ్బ తీయవచ్చునని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications