అసెంబ్లీ స్తంభన, వాయిదా: టిడిపి, తెరాస చెరో దారి

తెలుగుదేశం, తెరాస సభ్యులు తమ తమ పట్టు వీడకపోవడంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని శాసనసభా వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు పదే పదే చెప్పారు. సభా కార్యక్రమాలను సజావుగా నడిపించుకుందామని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. అయితే, తెరాస, తెలుగుదేశం సభ్యులు మాట వినలేదు. దీంతో మరోసారి స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేసి, ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ఓటింగు జరిగితే ప్రభుత్వం పడిపోతుందని, అందు వల్ల తెలంగాణ తీర్మానం సభలో చర్చకు రాకుండా పోతుందని తెరాస సభ్యులు అంటున్నారు. వరుసగా మూడో రోజు సభా కార్యక్రమాలు స్తంభించాయి.












Click it and Unblock the Notifications