తెలంగాణలో బలగాలతో సంబంధం లేదు: గవర్నర్

Narasimhan
న్యూఢిల్లీ: తెలంగాణలో మోహరించిన అదనపు బలగాలతో తనకు సంబంధం లేదని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చెప్పారు. అదనపు బలగాల ఉపసంహరణ విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని ఆయన అన్నారు. ఆయన శనివారంనాడు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాన్ని కలిశారు. మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండి, పలువురు పెద్దలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. చిదంబరాన్ని తాను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై గానీ రాష్ట్ర పరిస్థితిపై గానీ తాను ఏ విధమైన నివేదిక ఇవ్వలేదని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ చూసుకుంటారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయని, ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితిపై ఆయన హోం మంత్రి చిదంబరానికి వివరించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+