మా వాళ్లే: జగన్, చిరు ఎమ్మెల్యేలకు అధిష్టానం బాసట

మరోవైపు జగన్ వర్గం కాంగ్రెసు ఎమ్మెల్యేలకు కూడా అధిష్టానం బాసటగా నిలిచింది. కొన్నాళ్లు పార్టీకి దూరమైనంత మాత్రాన వారు మా పార్టీ ఎమ్మెల్యేలు కాకుండా పోరని చెప్పారు. గాంధీ భవన్‌కు ఖచ్చితంగా రావాల్సిందేనన్న పిసిసి చీఫ్ బొత్స వ్యాఖ్యలతోనూ అధిష్టానం విభేదించింది. జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పార్టీ కార్యాలయానికి రావాల్సిందంటూ నిబంధన ఏమీ లేదని చెప్పింది. వారు కొంతకాలం పార్టీకి దూరంగా ఉంటున్నప్పటికీ ఇప్పటికీ కాంగ్రెసు ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తున్నామని, వాళ్లను ప్రత్యేకంగా చూస్తున్నామన్న వ్యాఖ్యల్లో నిజం లేదని పేర్కొంది.












Click it and Unblock the Notifications