మాకు మిత్రులు లేరు: కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోసిన ఈటెల

తెలంగాణ తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అన్న కాంగ్రెసు మోసం చేస్తోందన్నారు. కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట లేనప్పుడు మరో మాట చెబుతోందన్నారు. 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ప్రకటించినప్పుడు పండుగ చేసుకున్నామని కానీ మరుసటి రోజే అందరూ పెదవి విరిచారన్నారు. మేం గెలిచింది తెలంగాణ ప్రజల అండతో మా ఆశయం ప్రత్యేక రాష్ట్రం అన్నారు. 2006లో కెసిఆర్‌ను వందల మాటలు అన్నారని అయినా తెలంగాణ కోసం మేం ఎవ్వరితోనైనా కలవడానికి సిద్ధపడ్డామన్నారు. ప్రణబ్ కమిటీ ద్వారా నాలుగు వారాల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పి పరిష్కరించలేదన్నారు.
తెలంగాణపై రాష్ట్రపతితో కూడా అబ్దం చెప్పిన ఘనత కాంగ్రెసుదే అన్నారు. ఏ పార్టీ అండతో గెలిచారో ఆ పార్టీనే కాంగ్రెసు మింగేస్తుందన్నారు. పార్లమెంటులో 120 కోట్ల భారతీయుల ప్రజల సాక్షిగా ప్రకటించిన తెలంగాణపై కేంద్రం వెనక్కి వెళ్లిందన్నారు. తెలంగాణ కోసం పదవులను గడ్డిపరకలా పారవేశామన్నారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను పాటించాల్సిన బాధ్యత పార్టీల పైన ఉందన్నారు. తెలంగాణపై కేంద్రానికి రాసిన లేఖకు టిడిపి కట్టుబడి ఉండాలన్నారు. తెలంగాణపై టిడిపి మాట తప్పిందన్నారు.
ప్రజారాజ్యం, ఎంఐఎం పార్టీలో అవిశ్వాసం పేరుతో తమ డిమాండ్లు నెరవేర్చుకున్నాయని తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలు కూడా దీనిపై ఆలోచన చేయాలని కోరారు. డిసెంబర్ 23 ప్రకటన చూసి తెలంగాణ పల్లెల గుండె పగిలిందన్నారు. టిడిపి, కాంగ్రెసు పట్ల తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు. తెలంగాణ ఆత్మహత్యలను ఈటెల సభలో ప్రస్తావించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది కాబట్టే మేం అవిశ్వాసం పెడుతున్నామని చెప్పారు.
ఈ సభ మా సభ కాదని ఆంధ్రా పాలకుల సభ అని విమర్శించారు. సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీల పైనే కేసులు పెట్టిన ఘనత కాంగ్రెసుది అన్నారు. కాంగ్రెసు పార్టీ ఇప్పటి వరకు తెలంగాణపై అవిశ్వాస తీర్మానం పెట్టలేదన్నారు. పోలవరం టెండర్ల విషయంలో మా పార్టీ నేతలకు సంబంధం ఉంటే ముక్కు నేలకు రాసుకుంటానని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications