తెలంగాణ ఏర్పడితే రాజధాని హైదరాబాద్: అక్బరుద్దీన్

గత రెండేళ్లుగా రాష్ట్రంలో పాలన స్తంభించిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ వాదన వినిపించే హక్కు ఉందన్నారు. తెలంగాణపై యుపిఏ త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆకాంక్షించారు. ఆలస్యమైతే రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు. ఉద్యమాల వల్ల తెలంగాణ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణపై కేంద్రం ఎందుకు నాన్చుతుందో చెప్పాలన్నారు. రూపాయికి కిలో బియ్యం ప్రజలు తినలేక పోతున్నారన్నారు. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పోయాయన్నారు. మక్కా మసీద్ పేలుళ్లలో ముస్లిం యువతపై పెట్టిన కేసులు ఇంత వరకు ఎత్తి వేయలేదని ప్రభుత్వం ఆ హామీ వెంటనే నెరవేర్చుకోవాలన్నారు.
మతకల్లోహాల్లో హిందూ-ముస్లిం యువతపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు తర్వాత ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వాలన్నారు. ఆరోగ్యశ్రీ వల్ల కార్పోరేట్ ఆసుపత్రులో లబ్ధి పొందుతున్నాయన్నారు. ఆరోగ్యశ్రీకి ఇచ్చే నిధులను నిమ్స్, ఉస్మానియాకు ఇస్తే పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు.












Click it and Unblock the Notifications