లాబీల్లో జగన్ ఎమ్మెల్యేలను దువ్వుతున్న కెవిపి

KVP Ramachandar Rao
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియమిత్రుడు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం శానససభ్యులను దువ్వుతున్నారు. ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రతిపాదించిన నేపథ్యంలో ఆయన సోమవారం అసెంబ్లీ లాబీల్లో జగన్ వర్గం శాసనసభ్యులతో మాట్లాడుతున్నారు. జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులను ప్రభుత్వానికి మద్దతుగా కూడగట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అసెంబ్లీ లాబీల్లో జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు. తాజాగా, ఆయన గుర్నాథ్ రెడ్డితో మాట్లాడారు.

వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులతో కెవిపి రామచందర్ రావు ఆదివారం గ్రూపుగా మాట్లాడారు. ఇప్పుడు ఒక్కొక్కరితో సమావేశమవుతున్నారు. పార్టీ అధిష్టానం సూచనతో కెవిపి రంగంలోకి దిగి జగన్ వర్గం శాసనసభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులతో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం శాసనసభ ఆవరణలో సమావేశమయ్యారు. మొత్తం మీద, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులను బుజ్జగించడంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం విజయం సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+