వైయస్ పాదయాత్ర ఓ కుట్ర: రేవంత్ రెడ్డి, జగన్‌పై సెటైర్

ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ తీరును తప్పు పడుతూ పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డిలు మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రిని నిలదీసిన అంశాన్ని, మంత్రి శంకర్ రావు తోటి మంత్రులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజల విశ్వాసం కోల్పోయారు కాబట్టే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టామన్నారు. కిరణ్ ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదన్నారు. నిత్యావసర వస్తువులు నిత్యం ప్రజలను కాల్చుకు తింటున్నాయన్నారు. రచ్చబండ ప్రజల పాలిట గుదిబండగా మారిందన్నారు.
ప్రభుత్వం ఇస్తున్న రూపాయికి కిలో బియ్యం గాడిదకు పెడుతున్నారని, బియ్యంలో అరకిలో పురుగులు ఉంటున్నాయని ధ్వజమెత్తారు. రైతు ప్రభుత్వమంటే భారీగా ధరలు పెంచడమేనా అని ప్రశ్నించారు. ఈనాటి తమ అవిశ్వాసానికి 2004 పునాది అన్నారు. తెలంగాణ అంశాన్ని తేల్చాల్సింది కాంగ్రెసు పార్టీయే అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థులపై ప్రభుత్వం తూటాలు పేల్చుతుందన్నారు. విద్యార్థుల ఆగ్రహ జ్వాల నుండి తెలంగాణ ఉద్యమం పుట్టుకు వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications