వైయస్సార్‌ను అనుకరిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy and YS Rajasekhar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని అనుకరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం అవిశ్వాసంపై శాసనసభలో చర్చ సందర్భంగా, చర్చకు సమాధానం ఇచ్చే సందర్భంగా ఆయన శైలి అందుకు అనుగుణంగానే ఉంది. ప్రతిపక్షాల నాయకులపై, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కునే విషయంలో వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా దూకుడుగా వ్యవహరించడానికి ప్రయత్నించారు. ఎదురు దాడికి దిగారు. చర్చ మధ్యలో జోక్యం చేసుకుని చంద్రబాబును రెచ్చగొట్టే విషయంలోనూ, ఏకవచన ప్రయోగం చేసి న్యూనత పరచడంలోనూ ఆయన వైయస్ పద్ధతిని అనుసరించారని చెప్పవచ్చు. వైయస్సార్ మాదిరిగా తనదైన శైలిలో దాటిగా మాట్లాడడం, తెలుగులో తొణక్కుండా ప్రసంగిచడం కిరణ్ కుమార్ రెడ్డి వల్ల కావడం లేదు. అయితే, మెల్లగా ఆయన దానికి అలవాటు పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

పథకాలను ప్రవేశపెట్టి వాటిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో కూడా ఆయన వైయస్సార్‌నే తలపిస్తున్నారు. రూపాయికి కిలో బియ్యం పథకం విషయంలోనూ, రాజీవ్ యువకిరణాలు పథకం విషయంలోనూ ఆయన వ్యవహరించిన తీరు మనకు ఈ విషయం అర్థమవుతుంది. కొంత మంది మంత్రులను, శాసనసభ్యులు నమ్మకంగా తన వైపు ఉంచుకుని మిగతావారిని తనకు అనుగుణంగా నడుచుకునేలా చేయడం వైయస్ పద్ధతి. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రులు శైలజానాథ్, విప్ కొండ్రు మురళి వంటివారు అత్యంత సన్నిహితులుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని కూడా వైయస్‌ను కొంత మంది వెనకేసుకొస్తూ ఉన్నట్లుగానే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని వెనకేసుకొచ్చేవారు కూడా తయారవుతున్నారు.

కిరణ్ కుమార్ రెడ్డిని అవినీతిరహితుడిగా, మచ్చ లేని నాయకుడిగా నిలబెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు అర్థమవుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డిపై ఏదో మేరకు అవినీతి ముద్ర పడింది. దానికి మాత్రం ఆయన దూరంగా ఉన్నట్లు చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవినీతిరహిత ప్రభుత్వాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+