సుధాకర్ నిర్బంధంపై టి - కాంగ్రెసు ఎంపీలు గరం

గతంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు విద్యార్థులపై కేసులను ఎత్తేయాలని ఆయన కోరారు. చేరుకు సుధాకర్‌ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం జరిగితే బాగుండేదని ఆయన అన్నారు. విద్యార్థుల విడుదలకు తెలంగాణ మంత్రులు, శానససభ్యులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. తెలంగాణ శానససభ్యుల బలంతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అవిశ్వాసం నుంచి గట్టెక్కిందని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందనే ఉద్దేశంతో తెలంగాణ శాసనసభ్యులు ప్రభుత్వానికి సహకరించారని ఆయన చెప్పారు. పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం, రాజయ్య కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications