కోట్లు కోనేరు ప్రసాద్ కొడుకు ఖాతాలోకి: సిబిఐ కౌంటర్

కోనేరు ప్రసాద్ కుమారులు తమకు సహకరించడం లేదని చెప్పింది. ఇ - మెయిల్ ద్వారా నోటీసులు పంపినా కోనేరు ప్రసాద్ కుమారులు ప్రతిస్పందించలేదని, ప్రశ్నావళిని పంపినా సమాధానాలు ఇవ్వలేదని వివరించింది. కోనేరు ప్రసాద్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. కోనేరు ప్రసాద్ సమాజంలో పెద్ద మనిషి అని, అందువల్ల సాక్షులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని అన్నది. కోనేరు ప్రసాద్‌కు బెయిల్ ఇవ్వవద్దని కోరింది. కోనేరు ప్రసాద్ బెయిల్ పిటిషన్‌కు సిబిఐ ఏడు పేజీల కౌంటర్ దాఖలు చేసింది. 2004 నవంబర్ 16వ తేదీకి ముందు నుంచే కోనేరు ప్రసాద్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని తెలిపింది. స్టైలిష్ హోమ్స్‌కు చెందిన కోనేరు రంగారావుకు 138 కోట్లు చేరాయని, వాటిలో ఎక్కువ మొత్తాన్ని కోనేరు మధు ఖాతాలోకి మళ్లించారని సిబిఐ ఆరోపించింది. బదిలీ చేసిన డబ్బుల లెక్కలు ఎక్కడా చూపలేదని, దీంతో ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లిందని, ప్రభుత్వాన్ని కోనేరు ప్రసాద్ తప్పు దారి పట్టించలేదని చెప్పింది.. కోనేరు ప్రసాద్ విచారణకు ఎప్పుడూ సహకరించలేదని, అందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని చెప్పింది. అసలు విషయాలు చెప్పకుండా కోనేరు ప్రసాద్ ఏవేవో చెబుతున్నారని ఆరోపించింది.












Click it and Unblock the Notifications