తెలంగాణ ఇప్పటికిప్పుడు తేలదు: నీళ్లు చల్లిన డిఎస్

సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత తెలంగాణపై యుపిఎ భాగస్వామ్య పక్షాలతోనూ ఇతర పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతామని ఆజాద్ ఇటీవల చెప్పారు. కాంగ్రెసు పార్టీ నాయకుల మాటలను బట్టి తెలంగాణ అంశాన్ని అటక ఎక్కించేందుకే సిద్దపడినట్లు అర్థమవుతోంది. అప్పుడు, ఇప్పుడు అంటూ 2004 ఎన్నికల వరకు కూడా లాగాలనేది కాంగ్రెసు పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది. కాగా, తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పార్లమెంటు వద్ద గురువారంనాడు కూడా నిరసన వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని సర్వే సత్యనారాయణ సోనియాను కోరారు. రెండేళ్ల క్రితం సోనియా తన జన్మదిన కానుకగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయించారని, ఇప్పుడు అ ప్రకటనను అమలు చేస్తున్నట్లు ప్రకటన చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications