రాష్ట్ర పరిస్థితులకు కారణం బాబే: జగన్ వర్గం మేకపాటి

Mekapati Rajamohan Reddy
హైదరాబాద్: రాష్ట్రం అల్లకల్లోలం కావడానికి కారణం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే కారణమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం కాంగ్రెసు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం అంబేడ్కర్ 55వ వర్ధంతి సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దళితుల సమగ్రాభివృద్ధి రాష్ట్ర సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అర్హత లేని నాయకుల వల్ల రాజ్యాంగం అపహాస్యం పాలవుతోందని విమర్శించారు. నాయకత్వ లోపం వల్ల రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నాయని, అంబేడ్కర్, బాపూజీ వంటి నేతల కోసం దేశం ఎదురు చూస్తోందన్నారు. భవిష్యత్తు ఖచ్చితంగా వైయస్సార్ కాంగ్రెసుదే అన్నారు.

పాలకులలో చిత్తశుద్ధి ఉంటే ప్రజల జీవితాలు ఎలా మెరుగుపడుతాయో చెప్పడానికి దివంగత వైయస్ మంచి ఉదాహరణ అన్నారు. వైయస్ మరణం తర్వాత కేంద్ర, రాష్ట్ర పాలకులు తెలుగు ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అల్లకల్లోలం కావడానికి చంద్రబాబు కారణం అన్నారు. విశ్వసనీయత లేని బాబు అధికారం కోసం తాపత్రయపడటం సిగ్గుచేటన్నారు. తెలంగాణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+