ఇండియన్స్‌ను విడుదల చేసిన చైనా, నా గొప్పేనని మోడీ

తాను చెసిన కృషి వల్లనే వజ్రవ్యాపారులు, కార్మికులు విడుదలయ్యారని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకుంటున్నారు. తన విజ్ఞప్తిని మన్నించినందుకు ఆయన చైనాకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. గత నెలలో తాను చైనాలో పర్యటించినప్పుడు న్యాయప్రక్రియను వేగవంతం చేయాలని కోరానని, అందుకు అనుగుణంగానే చైనా వ్యవహరించిందని ఆయన అంటున్నారు. హాంగ్‌కాంగ్ నుంచి చైనాకు 7.3 మిలియన్ డాలర్ల విలువ చేసే వజ్రాలను అక్రమంగా చేరవేస్తూ 2010 జనవరిలో వారు పట్టుబడ్డారు. పట్టుబడిన 22 మందిలో 14 మంది ముంబైకి, 8 మంది సూరత్‌కు చెందినవారు.












Click it and Unblock the Notifications