చంద్రబాబు వెకేట్ పిటిషన్‌పై విచారణ వాయిదా

విచారణ పారదర్శకంగా సాగుతుందని న్యాయమూర్తులు చెప్పారు. అయితే, ఇక్కడ విచారణ తమకు అనుకూలంగా ఉండదని అంటూ విచారణను వేరే బెంచీకి మార్చాలని సుశీల్ కుమార్ కోరారు. సుశీల్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించడంతో చంద్రబాబు వెకేటే పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. విచారణను వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్‌పై చంద్రబాబు ఆస్తుల మీద హైకోర్టు సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తదితర విచారణలకు ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు సూచన మేరకు చంద్రబాబు హైకోర్టులో వెకేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ ఏ బెంచీలో జరుగుతుందనేది ప్రధాన న్యాయమూర్తి తేల్చాల్సి ఉంటుంది. కాగా, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కేసులో నిందితుడు రాజగోపాల్ జ్యుడిషియల్ రిమాండ్‌ను ఈ నెల 15వ తేదీ వరకు పొడగిస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications