అవకాశం వదిలారు: కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత

తెలంగాణ కోసం జెఏసి చేపట్టే ప్రతి ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు పాల్గొంటాయని ఉద్యోగ సంఘాల నేతలు స్వామిగౌడ్ ప్రకటించారు. ఉద్యమం ఫలితంగానే డిసెంబర్ 9 ప్రకటన వచ్చిందన్నారు. జగన్ కోసం 17 మంది శాసనసభ్యులు వెళ్లినప్పుడు ఏడువందల మంది ఆత్మహత్యలు చేసుకున్నా టి-కాంగ్రెసు స్పందించక పోవడం శోచనీయం అన్నారు. నేతలు సహకరించక పోవడం వల్లనే తెలంగాణ ఆలస్యమవుతోందని ఆరోపించారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. మహిళలు ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసే కుట్రలకు ఉద్యోగులు వెనక్కి పోయే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ అగ్ని పర్వతంలాంటిదని అది ఎప్పుడైనా బయటపడవచ్చన్నారు.












Click it and Unblock the Notifications