చినజీయర్ స్వామి వ్యాఖ్యలు తప్పు పట్టం: కనుమూరి

kanumuri bapiraju
న్యూఢిల్లీ: చినజీయర్ స్వామి వ్యాఖ్యలను తప్పు పట్టాల్సిన పని లేదని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు శుక్రవారం అన్నారు. ఆయన వ్యాఖ్యలు తాము తప్పుపట్టమని ఆ వ్యాఖ్యల్లో నిజం ఉంటే సరి చేసుకుంటామని చెప్పారు. తాను చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సంస్కరణలు చేపట్టినట్లు చెప్పారు. ఎవరు ప్రశ్నించినా సానుకూలంగా స్పందించి అందులోని నిజానిజాలు తెలుసుకుంటామన్నారు. తిరుమలలో మద్యం, పొగ త్రాగవద్దని ఆయన భక్తులకు సూచించారు. ఇందుకోసం అవసరమైతే భక్తుల కాళ్లు పట్టుకుంటానని చెప్పారు.

కాగా డిసెంబర్ 9న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకు కనుమూరి దంపతులు ఢిల్లీ వచ్చారు. సోనియాకు తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం తీసుకు వెళ్లి ఇచ్చారు. చినజీయర్ వ్యాఖ్యలతో రాజమండ్రి ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్ రౌతు సూర్యప్రకాశ్ రావు ఏకీభవించారు. కాగా గురువారం ఓ కార్యక్రమంలో చినజీయర్ స్వామి మాట్లాడుతూ తిరుపతికి వెళుతుంటే క్లబ్బుకు వెళ్తున్న భావన కలిగిస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+