తెలంగాణపై కోమటిరెడ్డి మోసం చేశారు: కోదండరామ్

డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణను సీమాంధ్ర పెట్టుబడిదారులు బ్లాక్ మెయిల్ చేసి అడ్డుకున్నారని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని లేదంటే ఉద్యం ఉధృతంగా కొనసాగిస్తామని చెప్పారు. అమరవీరుల సాక్షిగా పోరాటం కొనసాగుతుందన్నారు. పోరాటాల ద్వారానే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. సుదీర్ఘంగా ఎదురు చూసే ప్రక్రియ లేదని తెలంగాణ ప్రజలంతా రాష్ట్రం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు స్పష్టత ఇచ్చిన తర్వాతే టిడిపి ఫోరం ఉద్యమించాలని డిమాండ్ చేశారు.
బాబు అసెంబ్లీలో తెలంగాణ గురించి మాట్లాడక పోయినా ఆయన మా నేత అంటే సరిపోదన్నారు. ప్రజాప్రతినిధులకు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే పార్టీలు వదిలి పోరాటం చేయాలన్నారు. ఉద్యమం ముందుకు పోకుండా టిడిపి అడ్డుపడుతుందని ఆరోపించారు. తెలంగాణ విషయంలో ప్రభుత్వం చూపుతున్న వైఖరిని తిప్పి కొట్టడంలో టి-నేతలు విఫలమయ్యారన్నారు. ఉద్యమం అనేక రూపాల్లో కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications