చిరంజీవికి రాజకీయాలు వద్దు!: జగన్‌వర్గం ఎంపీ సబ్బం

Sabbam Hari
హైదరాబాద్: చిన్న చిన్న పదవులు వదులుకోవడానికే తటపటాయిస్తున్న ఈ రోజుల్లో తాము నమ్మిన నాయకుడి కోసం ఏకంగా పదహారు మంది శాసనసభ్యులు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీని కాదని పదవులకు గుడ్‌బై చెప్పడానికి సిద్ధపడటం చారిత్రక ఘట్టమని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి గురువారం అన్నారు. మేం పడగొడతామంటే సర్కారును నిలబెడతామన్న చిరంజీవి రాజకీయాలు మాట్లాడకుండా ఉంటనే ప్రజలు హర్షిస్తారన్నారు. ఆయన రాజకీయాలు మానుకొని తన వృత్తికి పరిమితమైతే బాగుంటుందని సూచించారు. దివంగత వైయస్ మృతి చెందినప్పటి నుండి ఆ ఎమ్మెల్యేలు జగన్ వెంటే ఉన్నారని అలాంటప్పుడు వారిని కొన్నారని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు అంగడిసరుకుగా మారారంటున్న తులసీరెడ్డి మూడుసార్లు పార్టీలు మారినప్పుడు ఎంతకు అమ్ముడు పోయారో చెప్పాలన్నారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు సంక్షేమ పథకాల విషయంలో అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వేరుగా హైదరాబాదులో గురువారం అన్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన లెక్కలన్నీ తప్పుల తడకేనని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలేక పంట విరామం ప్రకటిస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా పథకాలు నిర్వీర్యం చేస్తూ అన్నీ తప్పుడు లెక్కలు చూపించిందని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+