చిరంజీవిపై జగన్ వర్గం ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఫైర్

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన చిరంజీవికి గానీ, ఆ పార్టీ విప్ వంగా గీతకు గానీ తనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసే హక్కు ఉందా అని ఆలోచించుకోవాలని ఆమె సూచించారు. తనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు తరఫున ఫిర్యాదు చేశారా, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఫిర్యాదు చేశారా చెప్పాలని ఆమె అడిగారు. తనపై ఫిర్యాదు చేసేందుకు ఏ విధమైన హక్కు ఉందో వారు తెలుసుకుంటే మంచిదని ఆమె అన్నారు. తాను అన్నింటికీ సిద్ధపడే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశానని, తానేమీ భయపడలేదని ఆమె అన్నారు. వంగా గీత తనపై చేసిన ఫిర్యాదును చూసి ప్రజలు నవ్వుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications