జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు: కిరణ్ కుమార్ రెడ్డి

వైయస్ జగన్ వర్గం శాసనసభ్యుల విషయంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. రాజకీయాలను వారు దిగజార్చారని, వారి స్థాయికి తాను వెళ్లదలుచుకోలేదని ఆయన అన్నారు. శాసనసభకు వచ్చేసరికి ప్రజారాజ్యం పార్టీ విడిగానే ఉందని, విప్‌ను ధిక్కరించిన ఆ పార్టీ శాసనసభ్యురాలిపై ఆ పార్టీ చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే ఆ పార్టీ ఫిర్యాదు చేసిందని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాలపై మీడియాలాగా తాను ఊహాగానాలు చేయలేనని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన అన్నారు. అధిష్టానం అనుమతించిన తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అధిష్టానం అవసరం అనుకున్నప్పుడు విస్తరణకు అనుమతి ఇస్తుందని, మీడియాకు చెప్పే విస్తరణ చేపడుతామని ఆయన అన్నారు.
అధిష్టానం పెద్దలతో జరిపిన చర్చల వివరాలను అన్నింటినీ మీడియాతో చెప్పలేనని ఆయన అన్నారు. మీరు మీ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడే విషయాలు బయటకు చెప్పనట్లే మేం కూడా అన్ని విషయాలు చెప్పలేమని ఆయన అన్నారు. చిరంజీవికి తగిన పదవి ఇస్తామని ఆయన అన్నారు. చిరంజీవి తాను మాట్లాడుకుంటూనే ఉన్నామని, నిన్న కూడా మాట్లాడుకున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెసు ప్రభుత్వమా, మిశ్రమ ప్రభుత్వమా అని అడిగితే ఫలితం వచ్చిన తర్వాత కూడా సందేహమా అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు.
తెలంగాణపై సంప్రదింపులు జరుగుతున్నాయని, రాష్ట్ర స్థాయిలో చర్చలు ముగిశాయని, చర్చలు పూర్తి చేసిన తర్వాత తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం తగిన ప్రకటనలు చేస్తాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రాంతీయ మండలి ఏర్పాటు చేస్తారనే వార్తల గురించి తనకేమీ తెలియదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications