మీడియాను మాట్లాడని కెసిఆర్, సుధాకర్‌కు పరామర్శ

తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం తనతో మాట్లాడినట్లు వచ్చిన వార్తలపై వివరణ ఇవ్వాల్సి వస్తుందని అనుకున్నారో, ఏమో ఆయన మీడియా వైపు చూడలేదు. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కెసిఆర్‌తో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఆ విషయంపై తాను మాట్లాడితే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతోనో, మీడియా నుంచి మరిన్ని ప్రశ్నలు వస్తాయనో ఆయన మీడియాను పట్టించుకోలేదు. మూడు రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా, చెప్పకుండా ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకున్న విషయంపై కూడా ప్రశ్నలు వస్తాయనే ఉద్దేశంతో ఆయన మీడియాకు దూరంగా ఉున్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం తీసుకునే నిర్ణయం విషయంలో తన ప్రమేయం ఉందనే విమర్శలను తప్పించుకోవడానికే కెసిఆర్ మీడియాతో మాట్లాడలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications