ఆజాద్‌తో జగన్ వర్గం ఎమ్మెల్యేలపై సిఎం కిరణ్ చర్చలు

కాంగ్రెసుకు తిరిగి రావడానికి జగన్ వర్గం శాసనసభ్యులకు అవకాశం ఇవ్వాలని, తిరిగి వస్తే చర్యలుండవనే సంకేతాలు ఇవ్వాలని వారిద్దరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే, గులాం నబీ ఆజాద్ బొత్స సత్యనారాయణతో చర్చించిన తర్వాతనే ఈ విషయం నిర్ణయం జరుగుతుంది. కాగా, తెలంగాణ అంశంపై, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై కిరణ్ కుమార్ రెడ్డి ఆజాద్‌కు వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశాన్ని తేల్చిన తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆజాద్ శుక్రవారంనాడు ప్రకటించారు. దీంతో తెలంగాణపై ముఖ్యమంత్రితో ఆజాద్ మాట్లాడినట్లు చెబుతున్నారు. దీంతో కొత్త సంవత్సరం ఆరంభంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ శానససభ్యులకు మంత్రివర్గంలో ఇవ్వాల్సిన స్థానాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications