తెలంగాణపై తుది నిర్ణయం పార్లమెంటుదే: ఉండవల్లి

Undavalli Arunkumar
న్యూఢిల్లీ: తెలంగాణపై తుది నిర్ణయం పార్లమెంటుదేనని, పార్లమెంటు నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పార్లమెంటు తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్ర విభజనకు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధం లేదని ఆయన అన్నారు. పాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ అంశం రాష్ట్రం నుంచి కేంద్రానికి వచ్చిందని, కేంద్రం ఏం చేస్తుందనేది చూడాలని ఆయన అన్నారు.

తెలంగాణపై ఏం చేయాలనేది కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చెప్తారని ఆయన ఆన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించడానికి వీలు లేదని ఆయన అన్నారు. తెలంగాణపై అందరీకి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. విప్ ధిక్కరించిన శానససభ్యులపై చర్చలు తప్పవని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై చర్యలు తీసుకుని ఉప ఎన్నికలకు వెళ్తే పార్టీ తీరు మెరుగు పడుతుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+