వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఎమ్మెల్యేలపై వేటు వేస్తే మధ్యంతరమే: నాగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

nagam janardhan reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేస్తే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదని అనూహ్య రాజకీయ పరిణామాలు సంభవించి మధ్యంతర ఎన్నికలు అనివార్యమౌతాయని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డి శనివారం అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు పట్టకుండా సోనియా గాంధీ భజన చేస్తున్న టి-కాంగ్రెసు ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని అణగదొక్కేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్సిస్తోందని వారిని ప్రజలు బొంద పెట్టడం ఖాయమని దుయ్యబట్టారు.

తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని అయితే ప్రజాభీష్టం మేరకు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలా లేక స్వతంత్రంగా బరిలోకి దిగాలా అనే విషయంపై ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 1969లో ఉద్యమకారులను కాల్చి చంపిన కాంగ్రెసు అంటే తనకు గిట్టదని ఆ పార్టీలో విలీనమయ్యే పార్టీలన్నా తనకు అంతే వ్యతిరేకమన్నారు. రెండు కళ్ల సిద్ధాంతమన్న టిడిపి వైపు చూసే ప్రసక్తి లేదన్నారు. ఐక్య ఉద్యమాలతో తెలంగాణ సాధ్యమన్నారు. ప్యాకేజీ పేరుతో కాంగ్రెసు కొత్త నాటకానికి తెరదీసిందని విమర్శించారు.

English summary
TNS president Nagam Janardhan Reddy suspected that mid-term election may come in state if suspend Jagan camp mlas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X