రోజాకు పిచ్చి పట్టిందని కోర్టే ధృవీకరించింది: వంగా గీత

పదవుల కోసం మేం బిచ్చగాళ్లలా ఎదురు చూడటం లేదన్నారు. మేం ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పడిన ప్రభుత్వానికి మద్దతు పలికామన్నారు. దివంగత వైయస్, శోభా నాగి రెడ్డి ద్వారా అప్పుడే విలీనం కోసం రాయభారం నెరిపారన్నారు. విప్ ధిక్కరించి ఓటు వేసిన వారే ఎంతకు అమ్ముడు పోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా పిచ్చి పట్టిన మాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.
కాగా అంతకుముందు రోజా చిరంజీవిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడింది. చిరంజీవివి దిగజారుడు రాజకీయాలు అని, ఆయన రాజకీయాలకు పనికి రాడని, పార్టీ పెట్టి పదవులను అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. చిరంజీవికి సంపాదనే ముఖ్యమన్నారు. ఆయన ప్రజాభిమానం కోల్పోయారని, పదవుల కోసం బిచ్చగాడిలా ఎదురు చూస్తున్నాడని విమర్శించారు. పిసిసి చీఫ్ బొత్స చరిత్రహీనుడు అని, సిఎంకు కిరణ్‌కు ప్రజా మద్దతు లేదన్నారు.












Click it and Unblock the Notifications