చిరుకు గౌరవం, తెలంగాణకు పరిష్కారం: బొత్స వ్యాఖ్య

ఉప ఎన్నికల్లో 24 సీట్లలో సాధ్యమైనన్ని సీట్లు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రచారంలో తాను, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి పాల్గొంటారని చెప్పారు. అన్నీ స్థానాల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. తెలంగాణపై శాశ్వత పరిష్కార దిశగా అధిష్టానం ఆలోచిస్తుందన్నారు. సాధ్యమైనంత త్వరగా ఇరు ప్రాంతాలకు ఇబ్బంది లేని పరిష్కారాన్ని అధిష్టానం సూచిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా బొత్స రెండు రోజుల క్రితం న్యూఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ తదితర నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించారు.












Click it and Unblock the Notifications