చంద్రబాబుకు షాక్: జగన్ పార్టీలోకి బోడ జనార్దన్

చంద్రబాబు ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించి ఇటు హైదరాబాదు చేరుకున్నారో లేదో బోడ జనార్దన్ తెలుగుదేశం పార్టీకి సలాం కొట్టి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. నిజానికి బోడ జనార్దన్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతారని భావించారు. కానీ ఎందుకో ఆయన మనసు మార్చుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. బోడ జనార్దన్ నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. అయితే బోడ జనార్దన్ గతంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండయ్యారు.












Click it and Unblock the Notifications