చిరంజీవికి వేటు వేయమనే హక్కు లేదు: శోభా నాగిరెడ్డి

Shoba Nagi Reddy
హైదరాబాద్: తనపై అనర్హత వేటు వేయమని కోరే నైతిక హక్కు తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి ఆదివారం అన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తామని ఎప్పుడో ప్రకటించారని అలాంటప్పుడు తనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరే హక్కు చిరంజీవికి గానీ, వంగా గీతకు గానీ లేదన్నారు. చిరు మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సి రావడం కాంగ్రెసుకు సిగ్గు చేటు అన్నారు. తనపై వేటు వేయాలని నిర్ణయం తీసుకుంటే న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తానన్నారు.

కాగా ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం జిల్లాలో అన్నారు. రైతుల పక్షాన నిలబడాలన్న ఉద్దేశ్యంతోనే తాము అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశామని, చంద్రబాబు అవిశ్వాసం పెట్టి రైతుల కంటే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి గురించే ఎక్కువగా మాట్లాడారని విమర్శించారు. రైతుల పాపం కాంగ్రెసుకు చుట్టుకుంటుందన్నారు. వైయస్ సంక్షేమ పథకాలు నీరుగార్చిన ప్రభుత్వంపై నిత్యం పోరాటం చేస్తామన్నారు. ప్రజల అండతోనే వారి కోసమే జగన్ పార్టీ స్థాపించారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+