పొద్దునోటి రాత్రి ఒకటి: కెసిఆర్‌పై దుమ్మెత్తిపోసిన ఎర్రబెల్లి

తెలంగాణ పేరుతో తెలుగుదేశం పార్టీ ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదన్నారు. టిఆర్ఎస్ తీరును తెలంగాణ ప్రజలు హర్షించరన్నారు. పోలవరం టెండర్లలో కెసిఆర్ పాత్ర ఉందని దానిని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కెసిఆర్ తెలంగాణ ప్రజలను సెంటిమెంటు పేరుతో మోసం చేస్తున్నారన్నారు. వ్యాపారస్తులు, సీని పరిశ్రమలోని వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ జెండాలు, పార్టీ పక్కన పెట్టి వస్తే మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ అభివృద్ధి టిడిపి హయాంలోనే జరిగిందన్నారు. టిఆర్ఎస్, కోదండరామ్ రెడ్డి ప్రజల్ని రెచ్చగొట్టవద్దన్నారు.
తెలంగాణ కోసం కెసిఆర్ ఒక్కడే పోరాడటం లేదని మందకృష్ణ మాదిగ, కొండా లక్ష్మణ్ బాపూజీ, చుక్కా రామయ్య, విమలక్క తదితరులు నిస్వార్థంగా పోరాటం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ వారికి మద్దతు తెలుపకుండా స్వార్థంతో రాజకీయాలు చేస్తున్న కెసిఆర్ ఏజెంటుగా మారారన్నారు. కోదండరామ్ రెడ్డికి దమ్ముంటే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం అందరికంటే మొదటిసారి రాజీనామా చేసిన టిడిపికి కూడా కోదండరామ్ ఎప్పుడూ మద్దతు పలకలేదన్నారు. టిడిపికి ఎప్పుడూ మద్దతు పలకని కోదండరామ్ రెడ్డికి తమను విమర్శించే హక్కు లేదన్నారు.
తెలంగాణకు అప్పుడు చెన్నారెడ్డి ఇప్పుడు కెసిఆర్, కోదండరామ్ రెడ్డి మోసం చేస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. తెలంగాణ వాదం వేరు టిఆర్ఎస్ పార్టీ వేరు అన్నారు. కోదండరామ్ టిఆర్ఎస్ ప్రతినిధిగా, తెలంగాణ అంశం వదిలేసి రాజకీయ నేతగా మాట్లాడుతున్నారన్నారు. ఉద్యమాన్ని పక్కదారి పట్టించి తెలంగాణ ద్రోహి కావొద్దని కోదండరామ్‌కు హితవు పలికారు. సమ్మెను అమ్ముకున్న ఘనత వారిద్దరిదే అన్నారు.












Click it and Unblock the Notifications