మంత్రుల ప్రమేయం ఉంటే చర్యలకు సిద్ధం: మోపిదేవి

ఎసిబి దాడుల వల్ల కొన్ని ఆధారాలు బయటపడ్డాయని చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం నవంబరు నెలలోనే ఏడువందలకు పైగా కేసులు పెట్టామన్నారు. ఒక్కొక్కరికి సుమారు 50 లక్షల రూపాయల నుండి లక్ష వరకు జరిమానా విధించామన్నారు. ఎమ్మార్పీ దాటి అమ్మకాలు జరిపితే చర్యలు తప్పవన్నారు. సంబంధిత శాఖ మంత్రిగా తాను కూడా ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. ఈ దాడులు ఎవరిని ఉద్దేశించి చేసినవి కావని, రాజకీయపరమైన దాడులు కానే కావన్నారు. అధికారులకు సమాచారం ఆధారంగానే దాడులు జరుగుతున్నాయన్నారు. మూడోసారి అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.
మద్యపాన విషయంలో విధానపరమైన మార్పుల అధ్యయనం కోసం నిపుణుల బృందాన్ని పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నామని, బడ్జెట్ సమావేశాలలోగా కొత్త రూపకల్పనలు అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎవరికీ మద్యం విషయంలో టార్గెట్లు లేవన్నారు. మంత్రివర్గంలో కూడా ఎలాంటి విభేదాలు లేవని, కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమష్టిగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంలో బినామీలు ఉంటే దాడులలో బయటపడతాయన్నారు.












Click it and Unblock the Notifications