వైయస్ జగన్ ఝలక్, తెలంగాణ నేతల తర్జన భర్జన

దీంతో ఇన్నాళ్లూ జగన్ నిర్ణయం కోసం వేచి చూసిన జగన్ వర్గం తెలంగాణ ప్రాంత నాయకులు, కార్యకర్తలు తర్జన భర్జన పడుతున్నారట. కొండా సురేఖ నియోజకవర్గంతో పాటు మిగిలిన నియోజకవర్గాలలో పోటీ చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సత్తా చూపించాలనే గట్టి విశ్వాసంతో ఆ ప్రాంత నాయకులు ఉన్నారు. ఇలాంటి సమయంలో కేవలం సీమాంధ్ర ఉప ఎన్నికల పైనే దృష్టి పెట్టడం వారు జీర్ణించుకోలేక పోతున్నారని సమాచారం. దివంగత వైయస్‌కు ఉన్న ఇమేజ్ ద్వారా పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందనే విశ్వాసం వారిలో ఉంది. అలాగే ఇప్పటి వరకు సీమాంధ్రకే పరిమితమైన జగన్, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలంటే ఉప ఎన్నికలే మంచి తరుణమని వారు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications