జగన్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం

nadendla manohar
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులకు సభాపతి నాదెండ్ల మనోహర్ సోమవారం నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో జగన్ వర్గానికి చెందిన పదిహేడు మంది ఎమ్మెల్యేలు(16 కాంగ్రెసు, 1 పిఆర్పీ) విప్ ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. విప్ ధిక్కరించిన తమ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని ప్రభుత్వ చీప్ విప్ కొండ్రు మురళి, పిఆర్పీ చీప్ విప్ వంగా గీత స్పీకర్ నాదెండ్లకు ఇటీవలె ఫిర్యాదు చేశారు. దానిని స్పీకర్ సోమవారం పరిశీలించి విప్ ధిక్కరించిన వారికి నోటీసులు పంపే అవకాశముంది. వారిని ఒక్కరొక్కరుగా పిలిచి వివరణ కోరనున్నారని సమాచారం.

స్పీకర్ పదహారు మంది కాంగ్రెసు ఎమ్మెల్యేల వివరణ తీసుకొని వేటు వేసే విషయం తేల్చనున్నారు. పీఆర్పీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి విషయమే అందరిలోనూ సస్పెన్స్‌ను రేకిత్తిస్తోంది. స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని అందరిలో ఉత్సకత కనిపిస్తోంది. ఓ వైపు పీఆర్పీ వేటు వేయాలని స్పీకర్‌‍ను కోరగా, శోభ మాత్రం ఇప్పటికే చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినందున తనకు అది వర్తించదని చెబుతున్నారు. మరి స్పీకర్ ముందు ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా స్పీకర్ చర్యలపై నిర్ణయం తీసుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+