వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో జగన్, మూడు రోజులు పార్లమెంటుకు హాజరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు. జగన్ తన సతీమణి భారతితో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. 19, 20, 21 మూడు రోజులు ఆయన అక్కడే ఉండనున్నారు. ఈ మూడు రోజులు పార్లమెంటు సమావేశాలకు హాజరు కానున్నారు. ఈ నెల ఇరవై ఒకటిన పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. జగన్‌తో పాటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా జగన్‌తో పాటు సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఆయన ఇటీవలె తన రాజీనామాను స్పీకర్‌కు అందజేశారు. ఇప్పటి వరకు స్పీకర్ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కాగా శుక్రవారం గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర ముగియగానే జగన్ నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత 17న పార్టీ సెంట్రల్ కమిటీతో భేటీ అయ్యారు. కాగా త్వరలో జగన్ తెలంగాణ జిల్లాల్లో ఓదార్పు యాత్ర చేపట్టనున్నారని ఆ పార్టీ నేతలు గట్టు రామచంద్రా రావు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆదివారం ప్రకటించారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy 
 
 reached Delhi to attend parliament sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X