ముఖ్యమంత్రిపై తీవ్రంగా మండిపడిన చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: లిక్కర్ సిండికేట్ల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. సిండికేట్లలో పాత్ర ఉన్న మంత్రులపై ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మద్యం సిండికేట్లకు సంబంధించిన వాస్తవాలను ముఖ్యమంత్రి వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్లతో సంబంధాలున్న మంత్రుల పేర్లు వెల్లడించడానికి ముఖ్యమంత్రి మొహమాట పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆబ్కారీ విధానంపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం నియంత్రణకు తగిన విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి సామాజిక బాధ్యత లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. అక్రమ మద్యంపై ఈ నెల 26వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తామని ఆయన చెప్పారు. అక్రమ మద్యాన్ని అరికట్టే వరకు పోరాటాన్ని సాగిస్తామని ఆయన హెచ్చరించారు.

ఎమ్మార్పీ రేట్లకే మద్యాన్ని విక్రయించాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్లను నియంత్రించాల్సింది పోయి ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. ఈ వ్యవహారాన్ని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తేలిగ్గా కొట్టిపారేశారని ఆయన అన్నారు. ఎసిబి దాడుల్లో బయటపడినవారి పేర్లను ఎందుకు వెల్లడించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందని ఆయన అన్నారు. మద్య నిషేధం విధించాలని గ్రామాల్లోని ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 50 వేల కోట్ల రూపాయల అక్రమ మద్యం విక్రయాలు జరిగాయని ఆయన ఆరోపించారు. మద్యం సిండికేట్ల ప్రజల రక్తం తాగుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సిండికేట్ మంత్రులను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+