పద్మనాభ స్వామి లాంటి సంపదే మరో ఆలయంలో?

Treasure
తిరువనంతపురం: కళ్లు మిరుమిట్లు గొలిపే సంపదతో తులతూగుతున్న అనంత పద్మనాభస్వామి ఆలయంలోని కోశాగారంలాంటిదే మరో ఆలయంలో ఉన్నట్లు తెలుస్తోంది. కేరళలోని విల్ బద్రీనాథ్ ఆలయంలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళిగలాంటి నేలమాళిగలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తిరుమలవిల్లలోని విల్ భద్రీనాథ్ ఆలయంలో ఆ నేలమాళిగలు బయటపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆలయానికి భద్రతను పెంచారు. ఎస్పీ ఆలయాన్ని పరిశీలించారు. ఈ ఆలయంలోని నేలమాళిగల్లో గుప్తనిధులు, పెద్ద యెత్తున ఆభరణాలు ఉన్నట్లు చెబుతున్నారు.

నాలుగు శతాబ్దం నాటి ఆ ఆలయం గుప్తనిధులతో నిండిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఆలయ నిర్వహణ కొచ్చిన్ దేవస్వోమ్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ బోర్డు నిర్వహణలో ఎర్నాకులం, పలక్కడ్, త్రిసూరు జిల్లాల్లోని 400 ఆలయాలు ఉన్నాయి. విల్ భద్రీనాథ్ దేవాలయంలో అనంత సంపద ఉన్నట్లు ప్రచారం జరగడంతో ఒక్కసారిగా మీడియా దృష్టి పడింది. ఆలయానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+