రాజీనామా చేయాల్సిందే: లోక్‌సభలో విపక్షాల పట్టు

మరోవైపు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కరవు, వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు నష్ట పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసి రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని టిడిపి నోటీసు ఇచ్చింది.
కాగా కేంద్ర కెబినేట్ లోక్‌పాల్ బిల్లుపై ఈ రోజు భేటీ కానుంది. ఈ భేటీలో సిబిఐ, ప్రధానమంత్రిని లోక్‌పాల్ పరిధిలోకి తెచ్చే అంశంపై చర్చిస్తారు. బిల్లుపై కేబినెట్లో పూర్తిగా చర్చించిన తర్వాత సభలో ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజే బిల్లు ప్రవేశ పెట్టాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడే అవకాశముంది. కాగా ప్రధాని, సిబిఐని కూడా లోక్‌పాల్ పరిధిలో చేర్చాలని అన్నాహజారే ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications