హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వం చెప్పుచేతల్లో సిబిఐ: చంద్రబాబు ఆరోపణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) ప్రభుత్వం చెప్పుచేతల్లో పనిచేస్తోందని, ప్రభుత్వాధీనంలో ఆ సంస్థ ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సిబిఐకి స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సిబిఐని లోక్‌పాల్ పరిధిలోకి తేవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోక్‌పాల్ బిల్లును అడుగడుగునా నీరు గారుస్తూ వచ్చారని ఆయన విమర్శించారు. అవినీతిపరులను శిక్షించే విధంగా బిల్లు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. అవినీతి మంత్రులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన దుయ్యపట్టారు. రాజకీయ నాయకులపై ప్రజలకు అపనమ్మకం కలుగుతోందని ఆయన అన్నారు. అవినీతి రహిత భారతదేశం కోసం పకడ్బందీగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

తమ ప్రభుత్వ హయాంలో తప్పు జరగలేదని, తప్పులు చేయడానికి అధికారులు భయపడ్డారని ఆయన చెప్పుకున్నారు. పార్టీలు, రాజకీయ నాయకులు ముఖ్యం కాదని, దేశం ముఖ్యమని ఆయన అన్నారు. కాంగ్రెసు పద్ధతులు సరిగా లేవని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. అవినీతిరహిత భారతదేశాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇందుకు పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు అవసరమని ఆయన అన్నారు.

మొన్నటి వరకు మైనింగ్ మాఫియా, నిన్న మద్యం మాఫియా, ఇప్పుడు ఇసుక మాఫియా - ఇలా మాఫియాలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం మాఫియాలకు అండగా నిలుస్తోందని ఆయన విమర్శించారు. మంత్రి శంకరరావుపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాడులను సమర్థించే పరిస్థితి ఉందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. ఎవరికి వారు అకౌంట్లను సెటిల్ చేసుకుంటున్నారు తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. మైనింగ్ అక్రమాల గురించి తనకు తెలియదని సబితా ఇంద్రా రెడ్డి అనడం సరి కాదని ఆయన అన్నారు.

English summary
TDP president N Chandrababu Naidu has accused that CBI is working according to the instructions of Union Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X