రాజకీయాలపై చిరంజీవి నో కామెంట్, విశాఖ పర్యటన

విశాఖపట్నం ప్రజలు తనను ఇతోధికంగా ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. తన పట్ల అపారమైన అభిమానం చూపుతున్న విశాఖపట్నం ప్రజలకు కృతజ్ఞతలు చెప్తున్నానని ఆయన అన్నారు. ఓ సదస్సులో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ఆయన ఇక్కడికి తిరిగి వచ్చారు. ఢిల్లీలో రాజకీయాలను ఆయన ఘాటుగానే పండించినట్లు వచ్చిన వార్తలను బట్టి అర్థమవుతోంది. తన శాసనసభ్యులకు మంత్రి పదవులు ఇప్పించుకోవడంలో ఆయన ఫలితం సాధించారని అంటున్నారు. డిసెంబర్ నెలాఖరులో మంత్రి వర్గ విస్తరణ జరిపి ముఖ్యమంత్రి ముగ్గురు ప్రజారాజ్యం శాసనసభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications