జగన్‌కు కాంగ్రెసు ఎంపీల షాక్: పవార్‌తో భేటీ రద్దు

అయితే.. బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయం అనంతరం హర్షకుమార్ సోనియాను కలిసి జగన్‌కు పవార్ అపాయింట్ మెంట్ ఇవ్వడం గురించి వివరించారు. దీని వల్ల తప్పుడు సంకేతాలు వెళతాయని, కాంగ్రెస్ ఎంపీలకు విలువ ఇవ్వకుండా జగన్‌కు ప్రాధాన్యతనీయడం సరైంది కాదని చెప్పారు. ఆ తర్వాత థామస్ పవార్‌తో మాట్లాడి జగన్‌తో సమావేశం రద్దు చేసుకొమ్మని కోరినట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం కూడా పవార్‌ను కలిసి జగన్‌తో సమావేశం సరైంది కాదని చెప్పారు. కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కూడా పవార్ సమావేశం ఏర్పాటు చేయడంపై పార్టీ పెద్దలతో తమ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. చివరకు కాంగ్రెస్ ఎంపీలు పవార్ జగన్‌కు ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను రద్దు చేయించడంలో కృతకృత్యులయ్యారు. దీంతో పవార్‌ను కలుసుకోకుండానే జగన్ బుధవారం రాత్రి హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టారు.












Click it and Unblock the Notifications