నాగం జనార్దన్ రెడ్డికి జెఎసి నేత కోదండరామ్ భరోసా

తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన ఐదుగురికి వచ్చే ఉప ఎన్నికల్లో తాము మద్దతిస్తామని ఆయన చెప్పారు. రేపు తెలంగాణ నమ్మకద్రోహ దినం పాటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాదులో ర్యాలీ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ర్యాలీలో తెలంగాణవాదులంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నాగం జనార్దన్ రెడ్డికి కోదండరామ్ మద్దతు ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాగర్‌కర్నూలు శానససభా నియోజకవర్గంలో ఆయనకు మద్దతునిస్తూ తన అభ్యర్థిని పోటీకి దించే అవకాశాలు లేవని భావిస్తున్నారు. కాగా, మహబూబ్‌నగర్ స్థానానికి ఏకగ్రీవ ఎన్నిక జరిగేలా చూడాలని బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్ని పార్టీల నాయకులను కోరారు.












Click it and Unblock the Notifications