జగన్‌తో టిడిపి ఎంపి సుజనా చౌదరి మంతనాలు

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, సుజనా చౌదరి, రామోజీ రావు, సీఎం రమేశ్, నామా నాగేశ్వరరావు, మురళీ మోహన్‌లాంటి వారికి లబ్ధి చేకూర్చారని జగన్ తల్లి వైఎస్ విజయమ్మ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను సవాలు చేస్తూ సుజనా చౌదరి హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన విషయమూ విదితమే. ఇప్పుడు అదే జగన్‌తో సుజనా చౌదరి సుమారు గంటపాటు మంతనాలు జరపడం టీడీపీ ఎంపీల్లోనే చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లోకి వ్యాపారాలను లాగడం సరి కాదనే అంశంపైనే వారు చర్చించి ఉండొచ్చని కాంగ్రెస్ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. జగన్‌ను టీడీపీ రాజ్యసభ సభ్యుడు మైసూరారెడ్డి కూడా ఎప్పటిలాగానే పలకరించి వెళ్లారు.












Click it and Unblock the Notifications