యుపి అసెంబ్లీ ఎన్నికల్లో జయప్రద పోటీకి రెడీ

చాలా కాలంగా ఆజం ఖాన్‌కు, జయప్రదకు మధ్య వైరం కొనసాగుతోంది. రాంపూర్ నియోజకవర్గం నుంచి 2009 లోకసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా ఆజం ఖాన్ జయప్రదను వ్యతిరేకించారు. ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం కూడా సాగించారు. పైగా, ముంబై ఉగ్రవాద దాడిలో మరణించిన ఎటిఎస్ చీఫ్ హేమంత్ కర్కరే సతీమణి కవితా కర్కరేను సమాజ్‌వాదీ పార్టీగా నిలబెట్టేందుకు ఆజం ఖాన్ అప్పట్లో ప్రయత్నాలు చేశారు. ఆజం ఖాన్ వంటి వ్యక్తులు శానససభలోకి ప్రవేశించకుండా చూసేందుకు జయప్రదనను పోటీకి దించాలని అమర్ సింగ్ నిర్ణయించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అర్వింద్ సింగ్ చెప్పారు.












Click it and Unblock the Notifications