అమెరికా, ఐరోపా వణికిపోతున్నాయి: దువ్వూరి సుబ్బారావు

Duvvuri Subba Rao
కాకినాడ: ప్రపంచం ముందు మరో ఆర్థిక మాంద్యం పొంచి ఉందని రిజర్వు బ్యాంకు గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు హెచ్చరించారు. దీని వల్ల అమెరికా, యూరప్, చైనాలతో పాటు ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా వణికిపోతున్నాయని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బ్యాంకర్ల సమావేశంలో ఆయన బుధవారం పాల్గొని మాట్లాడారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా 20 ఏళ్ల క్రితమే ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధించిందని, అక్కడి ప్రజలు, బ్యాంకు సిబ్బందిలో చైతన్యమే ఇందుకు కారణమన్నారు.

దేశంలో ఇప్పటికే మొదటి దశ ఆర్థిక ఉద్దీపనలు కొనసాగుతున్నాయని, త్వరలో ద్వితీయ శ్రేణి నగరాల్లో రెండో దశ ఉద్దీపనలు అమలు చేస్తామన్నారు. త్వరలో బ్యాంకు ఖాతాలను దేశంలో ఎక్కడికైనా, వేర్వేరు బ్యాంకులకైనా మార్చే దిశగా ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులకు బ్యాంకు సేవల విషయమై రిజర్వుబ్యాంకుకు రోజూ వందకు పైగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. బ్యాంకు సిబ్బంది ఆలోచనా సరళి మార్చుకోవాలని సూచించారు. 80% గ్రామీణులు ఇంకా బ్యాంకులకు దూరంగా ఉన్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే వారిని బ్యాంకింగ్ సేవలకు దగ్గర చేయాలన్నారు.

2012 మార్చి నాటికి అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ద్రవ్యోల్బణానికి అనేక కారణాలున్నాయన్నారు. ప్రధానంగా ప్రజల ఆహార అలవాట్లలో మార్పులు రావడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వృద్ధిరేటు పెరగడం వంటివి కూడా కారణాలేనన్నారు. చమురు ధరలు పెరగడం మరో కారణమన్నారు. యూరప్‌లో సంక్లిష్ట పరిస్థితులు, అమెరికాలో బ్యాంకుల రికవరీలు సన్నగిల్లడంతో రూపాయి మారకపు విలువ రికార్డుస్థాయిలో పడిపోయిందన్నారు. ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటుని, ఈ సంవత్సరం 7% వృద్ధిరేటు సాధించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+