జగన్‌తో భేటీపై సుజనా చౌదరి మీద బాబు అసంతృప్తి

సుజనా చౌదరి వ్యవహారంపై కొందరు పార్టీ నాయకులు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన సుజనా చౌదరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాము వైయస్ జగన్‌పై పోరాటం చేస్తుంటే సుజనా చౌదరి అలా చేయడమేమిటని అడుగుతున్నారు. అయితే, తాను మంతనాలు జరపలేదని, జగన్ కనిపించడంతో విష్ చేశానని సుజనా చౌదరి వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ వివరణతో పార్టీ నాయకులు సంతృప్తి చెందడం లేదు. నిజానికి, సుజనా చౌదరి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
వైయస్ విజయమ్మ చంద్రబాబు ఆస్తులపై వేసిన కేసులో సుజనా చౌదరి పేరు కూడా చేర్చారు. సుజనా చౌదరిపై ఆమె తాను వేసిన పిటిషన్‌లో తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. అయినప్పటికీ వ్యాపారమే ప్రధానమనే పద్ధతిలో సుజనా చౌదరి వ్యవహరించడం సరి కాదని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. తాము జగన్ ఎదురు పడినా పలకరించడం లేదని వారంటున్నారు.












Click it and Unblock the Notifications