పగటి వేషగాళ్లలా యాత్రలు: జగన్, బాబుపై కెటిఆర్

ఉద్యమానికి ఇది విరామమే కాని అంతం కాదన్నారు. 2014లో తెలంగాణ నినాదం మరోసారి రాకుండా వెంటనే కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమం నివురు గప్పిన నిప్పు అని అది ఎప్పటికీ చల్లారదన్నారు. ఇప్పటికే ఇరు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఇప్పటికైనా కేంద్రం తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ విషయంలో నలుగురు ముద్దాయిలు ఉన్నారన్నారు.
రాష్ట్రానికి అడ్డుపడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి ముద్దాయి, వాగ్ధానాలు ఇచ్చి వెనక్కి పోయిన రాజకీయ పార్టీలు రెండో ముద్దాయి, సీమాంధ్ర పెట్టుబడిదారులు మూడో ముద్దాయి, వెన్నెముకలేని ప్రజాప్రతినిధులు నాలుగో ముద్దాయని విమర్శించారు. తెలంగాణకు త్వరలో ముగింపు పలకాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications