కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ ఎంపి యాష్కీ బాసట

Madhu Yashki
తిరుపతి: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ మద్దతు ప్రకటించారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించిన సంక్షేమ పథకాలు బాగున్నాయని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సంక్షేమ పథకాలు బాగా లేవని పార్లమెంటు సభ్యులు అనడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని తేల్చకుండా ఉప ఎన్నికలకు వెళ్తే కాంగ్రెసు గెలిచే అవకాశాలు తక్కువని ఆయన అన్నారు. సమన్వయ కమిటీలో ఎస్సీలకు ప్రాతినిధ్యం లేదనడం సరి కాదని ఆయన అన్నారు.

మంత్రిగా ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని ఆయన అన్నారు. శంకరరావు గానీ మరే మంత్రి గానీ అలా మాట్లాడడం సమంజసం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం మంత్రులు సమిష్టి నిర్ణయాలతో నడుస్తుందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందినవారు ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశాలు తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+